చరణ్ సినిమాలలో ఈ ఫ్లాప్ సెంటిమెంట్ గమనించారా.. ఆ సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ( Ram charan ) ఇప్పటివరకు హీరోగా 14 సినిమాలలో నటించారు.

ఈ 14 సినిమాలలో మెజారిటీ సినిమాలు రామ్ చరణ్ కు సక్సెస్ అందించాయి.

అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలైనా ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాయి.అయితే చరణ్ నటించిన సినిమాలను గమనిస్తే ఆయన నటించిన సినిమాలలో మూడవ సినిమా, ఆరవ సినిమా, తొమ్మిదో సినిమా, పన్నెండో సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

రామ్ చరణ్ చిరుత సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టగా రెండో సినిమా మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అయితే మూడో సినిమా ఆరెంజ్ మాత్రం అంచనాలను అందుకోలేదు.రచ్చ, నాయక్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న చరణ్ కు ఆరో సినిమా తుఫాన్ రూపంలో మరో షాక్ తగిలింది.

ఎవడు, గోవిందుడు అందరివాడేలే రామ్ చరణ్ కు విజయాలను అందించగా తొమ్మిదో మూవీ బ్రూస్ లీ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

ధృవ, రంగస్థలం( Rangasthalam ) సినిమాలతో చరణ్ మళ్లీ వరుస విజయాలు సాధించగా 12వ సినిమా అయిన వినయ విధేయ రామ సినిమాతో షాక్ తగిలింది.ఆర్.ఆర్.ఆర్ తో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ కు తన సెంటిమెంట్ కు విరుద్ధంగా 14వ సినిమా అయిన ఆచార్య ఫలితం షాకిచ్చింది.అయితే చరణ్ సోలో హీరోగా నటించి ఉంటే ఈ సినిమా హిట్టయ్యేదని కొంతమంది చెబుతున్నారు.

అయితే తను నటించిన 3,6,9,12 సినిమాలతో ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ తన 15వ సినిమా అయిన గేమ్ ఛేంజర్( Game Changer ) తో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గేమ్ ఛేంజర్ నిరాశ పరిచే ఛాన్స్ లేదని ఛాన్స్ లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ సీక్వెన్స్ నెగిటివ్ సెంటిమెంట్ గురించి చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు