టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అదే ఊపుతూ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్( Game Changer ) అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
![Telugu Bollywood, Buchi Babu Sana, Rajkumar Hirani, Game Changer, Ram Charan, To Telugu Bollywood, Buchi Babu Sana, Rajkumar Hirani, Game Changer, Ram Charan, To](https://telugustop.com/wp-content/uploads/2023/08/Uppena-Buchi-Babu-Sana-Ram-charan-national-film-award-tollywood-social-media.jpg)
అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ ని లైన్ లో పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మరొక బాలీవుడ్ ప్రాజెక్టు కి( Bollywood Movie ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ సినిమా ఏది? డైరెక్టర్ ఎవరు? ఇందులో నిజమెంత అన్న విషయానికి వస్తే.చెర్రీ ప్రస్తుతం బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా కోసం సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.అయితే ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ఆ ఇమేజ్ ని అలాగే కంటిన్యూ చేయాలని తను చేయబోయే సినిమాలన్నీ కూడా హై స్టాండడ్స్లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
![Telugu Bollywood, Buchi Babu Sana, Rajkumar Hirani, Game Changer, Ram Charan, To Telugu Bollywood, Buchi Babu Sana, Rajkumar Hirani, Game Changer, Ram Charan, To](https://telugustop.com/wp-content/uploads/2023/10/Ram-Charan-to-work-with-Bollywood-Director-Rajkumar-Hirani.jpg)
ఇదిలా ఉంటే తాజాగా రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఒక యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన చరణ్‌ను రాజ్‌కుమార్ హిరానీ కలిసాడు.ఒక కథను కూడా నెరేట్ చేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారాలు పుట్టుకొచ్చాయి.
అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియదు కాని, రామ్ చరణ్‌తో రాజ్ కుమార్ హిరాని( Raj Kumar Hirani ) సినిమా సీక్రేట్ గా పని జరుగుతుంది అని సమాచారం.ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంత ఆశామాశి కాదనే చెప్పవచ్చు.
రాజ్ కుమార్ రెండు మూడేళ్లకు సినిమా చేస్తుంటాడు.అది కూడా ఇండస్ట్రీ హిట్ పక్కాగా తీస్తుంటాడు.20ఏళ్ల సినీ కెరీర్లో ఆయన తీసినవి ఐదు సినిమాలే అంటే రాజ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఏంటో అర్ధం అవుతుంది.ఇక ప్రస్తుతం రాజ్ కుమార్ ఆరో సినిమాగా డంకీ మూవీ తెరకెక్కనుంది.