తినడం మానేసిన మెగా అభిమాని.. రామ్ చరణ్ ఏం చేశాడంటే?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఆ అభిమాన హీరోల కోసం అభిమానులు ఏం చేయడానికైనా వెనుకాడరు.

ఇక తమ అభిమాన నటీనటులను కలుసుకోవడం కోసం కొంతమంది అభిమానులు పాదయాత్రలు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మరికొందరు వారి ఫోటోలను పేర్లను టాటూలాగా చిత్రీకరించుకుని వారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.

మరికొందరు వారి పేరు పై ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ వారి అభిమానులుగా గుర్తింపు సంపాదించుకుంటారు.ఈ విధంగా అభిమానులు తమ అభిమాన నటీనటుల పై ఈ విధమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

ఇకపోతే మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రాజమండ్రిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా సుమారు ఈ నెల రోజుల పాటు ఈయన రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరగబోయే షూటింగ్ లో పాల్గొంటారు.

ఇక రామ్ చరణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉన్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆయనని కలవడం కోసం షూటింగ్ లోకేషన్ కు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు తినడం కూడా మానేసి ఏకంగా తనని కలుసుకోవడం కోసం నిరీక్షణ మొదలుపెట్టారు.ఇలా తిండి తినటం మానేసి తన అభిమాన నటుడి కోసం ఎదురుచూస్తున్న ఆ అభిమానీ చివరికి తన పంతం నెగ్గించుకొని హీరో రామ్ చరణ్ ను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తో కలిసి ఫోటోలు దిగారు ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తన అభిమాన నటుడి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమాని రామ్ చరణ్ రాగానే తన పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే తన ఛాతీపై, చేతులపై రామ్ చరణ్ టాటూలు చూపించారు.ఈ విధంగా తనపై ఎంతో అభిమానంతో ఈ విధంగా వేయించుకున్న టాటూలను రామ్ చరణ్ చూస్తూ కాస్త ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక తనతో మాట్లాడి తనతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రామ్ చరణ్ తన అభిమానిని ఎంతో ప్రేమగా ఏమైనా తిన్నావా.అని అడిగారు.అందుకు ఆ అభిమాని మీకోసం తినకుండా ఇక్కడ ఎదురు చూస్తున్నారని తన స్టాఫ్ చెప్పడంతో వెంటనే రామ్ చరణ్ తన స్టాఫ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

తినడానికి ఏమైనా తీసుకురండి తినమని చెప్పాలి కదా అంటూ తన స్టాఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విధంగా రామ్ చరణ్ తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారనే విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు