అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మేకోవర్ వీడియో.. ఎవరైనా ఫిదా కావాల్సిందే!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు, మెగా అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.ఇలా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఒకరు అల్లూరి సీతారామరాజు ఒకరు కొమరం భీమ్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

అదే విధంగా ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తూ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ప్రాంతాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం అలాగే ముంబైలో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించడం జరిగింది.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి ఆయన సీతారామరాజుగా ఎలా మారారు? దాని కోసం రామ్ చరణ్ ఎలా కష్టపడ్డారనే విషయం తెలిసేలా రామ్ చరణ్ మేకోవర్ వీడియోను విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1920 బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన RRR సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఆయన సరసన సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించారు.

అలాగే ఇందులో అజయ్ దేవగణ్​​, శ్రియ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు.ప్రస్తుతం రామ్ చరణ్ మేకోవర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమా పై మరిన్ని అంచనాలను పెంచుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు యోధులను కలిపే ఒక ఊహాత్మక కథాంశంతో జక్కన్న ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు.ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు మరెంతో మంది సీనియర్ నటీనటులు ఒకే తెరపై కనిపించి సందడి చేయబోతున్నారని తెలియగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఈ క్రమంలోనే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

Advertisement

తాజా వార్తలు