మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
సిటీ బయట ప్రత్యేకంగా వేసిన ఆలయం సెట్ లో ఆచార్య షూటింగ్ జరుగుతుంది.ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఓ కీలక పాత్రలో సోనూసూద్ కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ కి సంబందించిన లుక్స్ ఇప్పటికే బయటకి వచ్చాయి.
ఇందులో ఓ మాస్ లీడర్ గా చిరంజీవి కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే రామ్ చరణ్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయంపై ఇన్ని రోజులు ఎలాంటి క్లారిటీ లేదు.మరో వైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉండటం వలన ఆచార్య షూట్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు.
అయితే వాటికి ఫుల్ స్టాప్ పడే విధంగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్రకి సంబందించిన లుక్ బయటకి వచ్చింది.

ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.ఇక అతని లుక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది.అయితే టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో ముఖద్వారానికి ఎదురుగా నిలబడినట్లు ఉన్న లుక్ లో చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
ఈ లుక్ రివీల్ చేసి ఆచార్య షూటింగ్ లో చరణ్ పాల్గొన్నట్లు స్పష్టం చేసింది.ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గురు శిష్యులుగా కనిపించాబోతున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న లుక్ ఒకటి రివీల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మెగా అభిమానులు ఉన్నారు.మరి వారి కోరికని కొరటాల మన్నిస్తాడో లేదో చూడాలి.