పెళ్లి అయిన హీరోయిన్ కు సౌత్‌ లో ఇంత డిమాండ్.. ఈమెకే సాధ్యం!

సాధారణంగా సౌత్‌ లో ముఖ్యంగా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెళ్లి అయిన హీరోయిన్స్ ను పట్టించుకోరు.

తెలుగు లో పెళ్లి అయిన హీరోయిన్స్ కొద్ది మంది మాత్రమే ఉన్నారు.

వారు కూడా చిన్నా చితకా ఆఫర్లు దక్కించుకుంటూ సినిమా లు చేస్తూ వస్తున్నారు.వారిలో చాలా మంది హీరోయిన్స్‌ కెరీర్ ముగింపు దశ లో ఉన్నారు.

పెళ్లి అయింది అంటే సినిమా ఇండస్ట్రీ( Film Industry )కి గుడ్‌ బై అన్నట్లే అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.కానీ ఈమధ్య కాలంలో ఒక హిందీ హీరోయిన్‌ పెళ్లి అయిన తర్వాత కూడా తెలుగు లో బిజీ గా ఉంది.

ఒక వైపు హిందీ లో వరుసగా సినిమా లు చేస్తూ ఉండగా మరో వైపు తెలుగు లో కూడా ప్రస్తుతం రామ్‌ చరణ్ తో ఒక సినిమా ను చేసేందుకు కమిట్‌ అయ్యింది.అంతే కాకుండా రామ్‌ చరణ్( Ram Charan ) తదుపరి సినిమా కు కూడా ఆమెను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక మరో స్టార్ హీరోకు కూడా ఈమెను జోడీ గా నటింపజేసేందుకు గాను చర్చ లు జరుగుతున్నాయి.

Advertisement

ఒక పెళ్లి అయిన హీరోయిన్ ను తెలుగు హీరో లు ఇంతగా కోరుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

యంగ్‌ హీరోల్లో చాలా మంది కూడా కొత్త హీరోయిన్స్ తో మరియు యంగ్‌ ఏజ్ లో ఉన్న హీరోయిన్స్ తో మరియు పెళ్లి కాని హీరోయిన్స్ తో మాత్రమే రొమాన్స్ కు సిద్ధం అవుతారు.కానీ హీరోయిన్‌ కియారా అద్వానీ( Heroine Kiara Advani ) పెళ్లి అయిన తర్వాత కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి నటన ప్రతిభ ఈ అమ్మడి సొంతం.

అందుకే ఈమెను చాలా మంది స్టార్స్ మరియు ప్రముఖ దర్శకులు కూడా కోరుకుంటున్నారు.ఇప్పుడే కాదు రాబోయే అయిదు సంవత్సరాల పాటు కూడా కియారా అద్వానీ తెలుగు లో బిజీ హీరోయిన్ గా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు