మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ తన తదుపరి సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.తన తదుపరిచిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో గేమ్ చేంజర్ ( Game Changer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

దిల్ రాజు ( Dil Raju ) బ్యానర్ లో 50వ సినిమా కావడంతో ఈయన కూడా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగబోతుందని ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#GameChanger పోస్ట్ థియేటర్ స్ట్రీమింగ్ రైట్స్ ని Zee5 వారు ₹270 cr కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇది రికార్డ్ ప్రైస్ అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోయాయి అంటే మార్కెట్లో రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.ఇలా ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఈ వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాకి ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఖర్చు అవుతుందనీ అయినప్పటికీ దిల్ రాజు వెనకడుగు వేయడం లేదని తెలుస్తుంది.







