ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏం జరిగిందంటే?

ఉపాసన( Upasana ) రామ్ చరణ్( Ram Charan ) జోడీ టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకటనే సంగతి తెలిసిందే.

ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుండగా ఉపాసనకు అంతా పాజిటివ్ గా జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఉపాసన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.ప్రెగ్నెన్సీ ( Pregnancy ) గురించి చెప్పిన సమయంలో చరణ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో ఉపాసన చెప్పుకొచ్చారు.

నేను గర్భవతిని అయ్యానని అనుకుంటున్నానని చరణ్ కు చెప్పగా ప్రశాంతంగా ఉండాలని ఎక్కువగా ఎగ్జైట్ అవ్వొద్దని చరణ్ అన్నాడని ఉపాసన కామెంట్లు చేశారు.ఒకసారి మనం పరీక్షలు చేయిద్దామని పరీక్షల్లో అంతా పాజిటివ్ గా తెలిస్తే మాత్రమే అందరికీ చెబుదామని చరణ్ అన్నాడని ఉపాసన చెప్పుకొచ్చారు.

అప్పుడే సంబరాలు చేసుకుందామని చరణ్ నాతో అన్నాడని ఉపాసన కామెంట్లు చేశారు.

Advertisement

ఈ రీజన్స్ వల్లే చరణ్ ను నేను ఎక్కువగా ఆరాధిస్తానని ఉపాసన వెల్లడించారు.చరణ్ వల్లే నేను ప్రశాంతంగా ఉండటంతో పాటు మరింత ఉత్సాహంగా ఉన్నానని ఉపాసన పేర్కొన్నారు.నా భావాలను వ్యక్తపరచడం అంటే నాకు చాలా ఇష్టమని ఉపాసన చెప్పుకొచ్చారు.

చరణ్ ఏ పనినైనా తనదైన శైలిలో ప్రశాంతంగా చేస్తాడని ఉపాసన వెల్లడించడం గమనార్హం.

చరణ్ ఫస్ట్ రియాక్షన్ గురించి తెలిసి నెటిజన్లు ఒకింత అవాక్కవుతున్నారు.గేమ్ ఛేంజర్ సినిమాతో, బుచ్చిబాబు సినిమాలతో చరణ్ బిజీగా ఉన్నారు.రామ్ చరణ్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.

వరుస ప్రాజెక్ట్ లతో చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించి కేర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన గెస్ట్ రోల్ లో కనిపిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు