తారక్ పై రామ్ చరణ్ డామినేషన్.. మీడియా ప్రశ్నకు చెర్రీ ఆన్సర్ విని అందరు షాక్ అయ్యారు!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఈ పాత్రల్లో వీరు హీరోయిజాన్ని చూపించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో విభిన్నంగా స్పందించారు.కొంతమంది అభిప్రాయం ప్రకారం చరణ్ పాత్ర తారక్ పాత్రను డామినేట్ చేసింది అని చెబితే, మరి కొంత మంది మాత్రం తారక్ పాత్ర చరణ్ పాత్రను డామినేట్ చేసింది అని తెలిపారు.

Advertisement

ఇంకొందరు అయితే చరణ్ ని డామినేట్ చేస్తూ తారక్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడని అంటున్నారు.ఏది ఏమైనా ఇద్దరు హీరోలు మాత్రం ఈ సినిమాలోని తమ పాత్రలపై సంతోషంగా ఉన్నారు అని చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న ముంబై లో ఘనంగా జరిగాయి.

ఈ సెలెబ్రేషన్స్ లో టీమ్ అంతా మరోసారి మీడియాతో మాట్లాడారు.ఈ వేదికపై ఒక జర్నలిస్ట్ ఇదే విషయాన్నీ మాట్లాడుతూ.సినిమాలో రామ్ చరణ్ అన్ని మార్కులు కొట్టేసాడు అంటూ ఎన్టీఆర్ పై చరణ్ డామినేషన్ విషయాన్నీ అడుగుదామని అనుకున్నారు.

కానీ ఈ లోపే చరణ్ ఈ విషయంపై మాట్లాడారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

అది అస్సలు నిజం కాదు.నేను దానిని అస్సలు నమ్మను.మేమిద్దరం చాలా బాగా చేసాం.

Advertisement

తారక్ అద్భుతంగా నటించాడు.నా కెరీర్ లో నేను మరే ఇతర సినిమా లో నేను ఇంత ఎంజాయ్ చెయ్యలేదు.

తారక్ తో నా ప్రయాణం అద్భుతం.అందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ చరణ్ తెలిపాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

తాజా వార్తలు