చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ( University of vels ) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లిన.చరణ్ అవార్డు అందుకున్నారు.
తెలుగు సినిమా రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఈ డాక్టరేట్ పొందుకోవటం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వారసుడిగా 2007వ సంవత్సరంలో “చిరుత” సినిమాతో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటివరకు మొత్తం 14 సినిమాలు చేయటం జరిగింది.“RRR” తో… ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది.
తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్( Ram Charan ) పాపులారిటీ రోజురోజుకి విస్తరిస్తూ ఉంది.దీంతో రామ్ చరణ్ కి డాక్టరేట్ రావడంతో.మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.“ఒక తండ్రిగా నాకు గర్వంగా… ఎమోషనల్ గా ఉంది.ఇదొక అద్భుతమైన క్షణం.బిడ్డలు గొప్ప విజయాన్ని సాధించినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం.రామ్ చరణ్ స్థిరంగా ముందుకు సాగుతున్నాడు.లవ్ యు డియర్ డాక్టర్ రామ్ చరణ్” అంటూ సోషల్ మీడియాలో చరణ్ డాక్టరేట్ అందుకుంటున్న వీడియో పోస్ట్ చేసి.
కామెంట్ పెట్టడం జరిగింది.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది.ఈ క్రమంలో చరణ్ కి డాక్టరేట్ రావటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.