అక్కడ రకుల్ సూపర్ బిజీ..!

తెలుగులో దాదాపు కెరియర్ ముగిసింది అనుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ అవకాశాలు అందుకుంటుంది.

ముఖ్యంగా తెలుగులో కన్నా అమ్మడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది అమ్మడు.తమిళంలో సూపర్ హిట్టైన రాట్చసన్ సినిమా తెలుగులో రాక్షసుడు గా రీమేక్ అయ్యింది.

ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

సూపర్ హిట్ సినిమా కాబట్టి రకుల్ కు బాలీవుడ్ లో మరో హిట్ సినిమా పడిందని అంటున్నారు.ఈ సినిమాతో పాటుగా రకుల్ కు బాలీవుడ్ లో మరో 3 సినిమాల ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది.

Advertisement

సౌత్ లో ఆమె కెరియర్ ఎలా ఉన్నా బాలీవుడ్ లో మాత్రం రకుల్ క్రేజీ సినిమాలు చేస్తుంది.అక్షయ్ కుమార్ తో సినిమా అంటే తప్పకుండా రకుల్ కు అక్కడ సూపర్ క్రేజ్ వచ్చినట్టే లెక్క.

మరి రకుల్ అక్కడైనా కొన్నాళ్లు స్టార్ డం కొనసాగిస్తుందో లేదో చూడాలి.తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో నటించింది రకుల్.

 క్రిష్ డైరక్షన్ లో వస్తున్న కొండపొలం సినిమాతో టాలీవుడ్ లో ఫాం లోకి రావాలని చూస్తుంది రకుల్.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు