తెలుగులో తక్కువ టైం లోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుని అంతే షార్ట్ టైం లో గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ).సందీప్ కిషన్ లాంటి యువ హీరోలతో జత కట్టిన రకుల్ తన యాక్టివ్ నెస్ తో స్టార్ ఛాన్స్ లు అందుకుంది.
అయితే తనకు వచ్చిన స్టార్ ఇమేజ్ ని కొనసాగించడంలో అమ్మడు ఫెయిల్ అయ్యింది.దాని వల్ల రకుల్ కి ఆఫర్లు రావడం ఆగిపోయాయి.
తెలుగు, తమిళ పరిశ్రమలో ఆఫర్లు ఆగిపోయే సరికి అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
తెలుగులో కొండపొలం తర్వాత రీసెంట్ గా బూ అంటూ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్.విశ్వక్ సేన్, రకుల్ కలిసి నటించిన ఆ సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది.
అది కూడా ఇప్పటి సినిమా కాదని తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా రకుల్ కి టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
సినిమా అంతా ఓకే అయ్యిందట.కానీ అనౌన్స్ మెంట్ కోసమే లేట్ చేస్తున్నారని తెలుస్తుంది.
మొత్తానికి రెండేళ్ల తర్వాత రకుల్ కి ఒక చెప్పుకునే ఆఫర్ తెలుగులో వచ్చినట్టు తెలుస్తుంది.