అతని టార్చర్ తట్టుకోలేక రహస్యంగా పెళ్లి చేసుకున్న.. రాఖి సావంత్!

బాలీవుడ్ సినీ, టెలివిజన్ నటి రాఖీ సావంత్.నటిగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

అంతేకాకుండా ఆమె హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.చివరి వరకు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో తెగ పంచుకుంటుంది.

ఇక తాజాగా తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు గురించి పంచుకుంది రాఖీ సావంత్.ఇక రాఖీ సావంత్ ఈ మధ్యనే పెళ్లి చేసుకోగా తాజాగా పెళ్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

Advertisement

ఇక ఆమె ఎన్నో స్పెషల్ సాంగ్ లలో హాట్ లుక్ లో కనిపించగా.ఆమెకు ఐటమ్ గర్ల్, ఐటెం బాంబ్ అనే పేరు కూడా పెట్టారు.

ఈ పేర్ల వల్ల తనకు ఎలాంటి రిగ్రెట్ లేవని తెలిపింది.తాజాగా రేడియో హోస్ట్ సిద్ధార్థ కన్నన్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.

తనకు హీరోయిన్ గా నటించే టాలెంట్ లేదని, ఐటెం సాంగ్స్ చేయడంవల్ల తనేమి బాధ పడనని తెలిపింది.మరికొన్ని విషయాలను పంచుకున్న రాఖీసావంత్.

తన సీక్రెట్ మ్యారేజ్ గురించి బయటకు చెప్పేసింది.బ్రిటన్ కు చెందిన రితేష్ అనే ఒక వ్యాపార వేత్తను రాఖీసావంత్ రహస్యంగా వివాహం చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలా చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిసింది.చెందిన ఓ మాఫియా డాన్ నుండి తప్పించుకోవడానికి రహస్యంగా పెళ్లి చేసుకుందట.

Advertisement

నరరూప రాక్షసుడు లాంటి ఆ మాఫియా డాన్ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని తెలిపింది.వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఇక తన జోలికి రాదనే ఉద్దేశంతో రితేష్ ని పెళ్లి చేసుకుంటుందట.

గతంలో తాను దాంతో కలిసి డేటింగ్ కు గోవా కు వెళ్లిందట.ఆ సమయంలో అతని ఫోన్ లో భయంకర వీడియో చూసిందట.అతను తన ఫాంహౌస్లో ఓ వ్యక్తిని చావ కొడుతున్న వీడియో చూసి భయపడిందట.

ఇక అప్పటి నుంచి అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసిందట.కానీ తనని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడని తెలిపింది.

ఇక అతని నుండి తప్పించుకోవడానికి ఇలా పెళ్లి చేసుకుందని తెలిపింది.

తాజా వార్తలు