శేఖర్ మాస్టర్ కు బాగా పొగరు.. సంచలన నిజాలు చెప్పిన రాకేష్ మాస్టర్?

రాకేష్ మాస్టర్ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పేరు మోపిన డాన్స్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్.

శేఖర్, జాని మాస్టర్ లాంటి ఎందరికో మంచి భవిష్యత్ ని ప్రసాదించిన వ్యక్తి రాకేష్ మాస్టర్.

లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ప్రముఖ సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.అలాగే ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ షో లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించారు రాకేష్ మాస్టర్.అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నారు.2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.ఇక పోతే కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రాకేష్ మాస్టర్ పై విభిన్న రీతిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు వివాదాస్పదం కూడా అయ్యాయి .కొన్ని సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, ఎన్టీఆర్, బాలయ్య, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మి‌లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు.

కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి, తన మాస్టర్ పైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వార్త ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించింది.ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా.రాకేష్ మాస్టర్ తాను ఇంతటి స్థాయికి రావడానికి తన గురువు ముక్కరాజు, సలీం మాస్టర్ అంటూ వాళ్లగురించి ఇప్పటికీ గొప్పగా చెప్తారట.కానీ తన శిష్యుడైన శేఖర్ మాస్టర్ మాత్రం తన పేరును ఎక్కడా చెప్పరని ఆయన అన్నారు.

ఆయనకి నేనే అన్న అహంభావం అనే ఫీలింగ్ ఉంటుందని ,శేఖర్ మాస్టర్ కు బాగా పొగరు ఎక్కువ అంటూ రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు