చంపేందుకు ప్రయత్నించారు.. రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..?

ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా బాగానే పాపులారిటీని సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోల ద్వారా, జబర్దస్త్ షో ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే తాజాగా రాకేష్ మాస్టర్ తనపై దాడి చేయడంతో పాటు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తన ఇంటి కిటికీలను ధ్వంసం చేశారని తనపై ఇష్టం వచ్చిన విధంగా దుర్భాషలాడారని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.సాయిమాదవ్, ఇమ్రాన్ అనే వ్యక్తులు తనపై దాడి చేశారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

కొన్ని నెలల క్రితం తాను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చానని ఆ ఇంటర్వ్యూ వల్ల తనపై దాడి జరిగిందని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణ నగర్ లోని ఏ బ్లాక్ లో ఉన్న దేవేందర్ గౌడ్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు.

తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాకేష్ మాస్టర్ కోరారు.అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

రాకేష్ మాస్టర్ గతంలో చాలా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలే ఈ గొడవలకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

మరోవైపు రాకేష్ మాస్టర్ శిష్యులు సైతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.రాకేష్ మాస్టర్ శిష్యుడు శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నంబర్ 1 డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నారు.

శేఖర్ మాస్టర్ కొరియాగ్రాఫర్ గా పని చేసిన చాలా సాంగ్స్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు