తెలంగాణ నుంచి సోనియాగాంధీకి రాజ్యసభ సీటు ప్రతిపాదన..!

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ( Sonia Gandhi ) రాజ్యసభకు పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.

ఖమ్మం లోక్ సభ నుంచి సోనియాను బరిలో దింపాలని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) మొదటగా ఏకగ్రీవ తీర్మానం చేసి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే లోక్ సభకు పోటీ చేయడానికి సోనియాగాంధీ కనుక విముఖత చూపితే రాజ్యసభ ప్రతిపాదనను తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్రాన్ని( Telangana state ) ఇచ్చిన సోనియాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందులో తెలంగాణలో మొత్తం మూడు స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో రెండు స్థానాలు కాంగ్రెస్ కు, ఒకటి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది.దీంతో ఏఐసీసీ కోటాలో సోనియాకు రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా రెండో సీటు కోసం ఆశావహులు భారీగానే ఉన్నారు.రాజ్యసభ స్థానం కోసం చిన్నారెడ్డి, రేణుకా చౌదరి మరియు వంశీ చందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు