రెండు గిన్నిస్‌ రికార్డులు

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్‌్డ రికార్డ్సులో కొత్తగా రెండు రికార్డులు నమోదయ్యాయి.ఈ రెండు రికార్డులు ఇండియాకు సంబంధించినవే.

పైగా మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినవే కావడం విశేషం.ఈ రెండు రికార్డుల వేదిక దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌.

ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగిన సంగతి తెలుసు.కుల, మతాలకు అతీతంగా, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా యోగా కార్యక్రమాలు జరుపుకున్నారు.

రాజ్‌పథ్‌లో జరిగిన క్యాక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు, అధికారులు సామాన్య జనంతో కలిసి యోగాసనాలు వేశారు.ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకుల లెక్కల ప్రకారం ముప్పయ్‌ఐదు వేల తొమ్మిది వందల ఎనభైఐదు మంది పాల్గొన్నారు.

Advertisement

గతంలో గ్వాలియర్‌లోనూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించినప్పుడు సుమారు ముప్పయ్‌వేల మంది పాల్గొన్నారు.ఆ రికార్డును యోగా డే అధిగమించింది.

అందుకే దీన్ని గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కించారు.మరో రికార్డు ఏమిటంటే.

రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎనభై నాలుగు దేశాలకు చెందినవారు పాల్గొన్నారు.ఇన్ని దేశాల వారు ఒక కార్యక్రమంలో పాల్గొనడం ప్రపంచ రికార్డు.

అందుకే దీన్ని గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కించారు.మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితలో యోగా డే ను ప్రతిపాదించి, దానికి ప్రాచుర్యం కల్పించి ప్రపంచ రికార్డు సాధించారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు