టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో రవితేజ సరసన రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ లు హీరోయిన్ లుగా నటించారు.ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదల కచ్చితంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది హీరోయిన్ రజీషా విజయన్.ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ట్రైలర్ ఈవెంట్ కూడా ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.కాగా ఇప్పటికే విడుదలైన టీజర్,పోస్టర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.రవితేజ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాతో రజీషా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.
ఇది ఇలా ఉంటే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రజీషా విజయన్ హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అప్పటివరకు రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ కాస్త అంతకు రెండింతలు పెరిగింది.ఈ క్రమంలోనే రజీషా సైతం తన ప్రేమను కురిపించింది.ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఓ మై గాడ్ ఆయన ఓ సింహం ఫైర్.
ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ ఫైర్‌లా కనిపించాడు.స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మంటలే అంటూ తన ప్రేమను కురిపించింది రజీషా విజయన్.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.