Rajinikanth : కూతురిని నమ్మి పెద్ద తప్పు చేసిన రజనీకాంత్.. ఇంత పరువు ఎప్పుడు పోలేదు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) సినిమా వస్తుందంటే చాలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా బజ్ క్రియేట్ అవుతుంది.

ఆ సినిమాల్లో రజనీ మేనరిజం, స్టైల్, డైలాగులు, ఎలివేషన్, ఎమోషన్స్ చూసేందుకు అభిమానులు బాగా ఇష్టపడతారు.

అందుకే రజనీకాంత్ ఈ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండేలా చూసుకుంటాడు.ఒకవేళ ఈ అంశాలలో ఏదైనా తక్కువ అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం ఖాయం.

ఈ హీరో మారడానికి ఎంత ట్రై చేసినా ప్రేక్షకులు మాత్రం కొత్తగా సినిమా తీసిన ప్రతిసారీ ఫ్లాప్ లు ఇస్తున్నారు అందువల్ల ఈ హీరో రోటీన్ సినిమాలు చేయక తప్పడం లేదు.ఇలా చేయడం వల్ల న్యూట్రల్ ఆడియన్స్ మెప్పించలేకపోతున్నాడు.

ఇటీవల కూతురు ఐశ్వర్య( Aishwarya ) తనకోసం ఒక రోల్ రూపొందించగా కనీసం దాని ద్వారానైనా మంచి గుర్తింపు తెచ్చుకుందామనుకున్నాడు.ఆమె తీసిన సినిమా పేరు లాల్ సలాం.( Lal Salaam ) ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్‌లో రజనీకాంత్ పోషించిన పాత్ర పేరు మొయిదీన్ భాయ్.

Advertisement

రజనీకాంత్‌ది గెస్ట్ క్యారెక్టర్ కాదు, అలాగని అది క్యారెక్టర్ ఆర్టిస్టు కాదు.ఈ మూవీలో హిందూ ముస్లింలు వేర్వేరు కాదని, మతం కన్నా మానవత్వమే గొప్పది అని ఐశ్వర్య ఒక సామాజిక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించింది.

అది కూడా అంతేన తండ్రి ద్వారా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచించింది.కానీ ఆమె డైరెక్షన్ బాగోలేకపోవడం, పైగా ఈ సందేశంతో ఆల్రెడీ బోలెడన్ని సినిమాలు రావడం వల్ల ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది.

ఈ సినిమాలో రెండు క్రికెట్ టీమ్స్( Cricket Teams ) మధ్య మతం అనేది మనస్పర్ధలకు దారితీస్తుంది.దానిపైనే ఐశ్వర్య ఒక కథ అల్లేసింది.రజనీకాంత్ చేత మతం గురించి చాలా డైలాగులు చెప్పించింది.

అవి అంతగా పేలలేదు, ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.ఈ మూవీ ఒక సీరియల్ లాగానే సాగింది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

అందువల్ల ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత థియేటర్ల నుంచి ఈ సినిమాని తీసేశారట.ఈ సినిమాకి ఎలాంటి హైప్‌ లేకపోవడంతో కొన్ని థియేటర్లు మార్నింగ్ షోలనే రద్దు చేశారట.

Advertisement

అంతటి గొప్ప హీరో అయిన రజనీకాంత్ మూవీని( Rajinikanth Movie ) ఇలా ఫస్ట్ డేనే తీసేయడం నిజంగా చాలామందిని విస్మయానికి గురి చేసింది.అసలు అది రజనీకాంత్ సినిమానైనా? ఐశ్వర్య ఇంత చెత్త మూవీ ఎలా తీసింది? బాగోలేని సినిమాలో తండ్రిని ఎందుకు నటింప చేసింది? అని రజనీ ఫ్యాన్స్ ఇప్పుడు బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు