సునామినే కాని, బాహుబలి సునామి కంటే తక్కువే

సౌత్‌ ఇండియా దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు రూపొందిన ‘2.ఓ’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

550 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.ఖచ్చితంగా రికార్డులు మారు మ్రోగడం ఖాయం అని, తప్పకుండా సినిమా బాహుబలి రికార్డులను సునాయాసంగా బద్దలు కొడుతుందని తమిళ తంబీలు తెగ ఆరాట పడ్డారు.

కాని 2.ఓ చిత్రం బాహుబలి 1 రికార్డు వద్దే ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

బాహుబలి 2 సినిమా స్థాయిలో వసూళ్లు సాధ్యం కాదని తేలిపోయింది.రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడంతో పాటు మాస్‌ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు లేని కారణంగా ఈ చిత్రం అన్ని ఏరియాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం అసాధ్యం అని తేలిపోయింది.ఇక ‘2.ఓ’ చిత్రం విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ఓవర్సీస్‌లో ఈ చిత్రం మరీ దారుణమైన ఫలితం ఎదురవుతోంది.రజినీకాంత్‌ గత చిత్రాల స్థాయిలో కూడా ఈ చిత్రం అక్కడ రాబట్టలేక పోవడం ఫ్యాన్స్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Advertisement

నార్త్‌ ఇండియాలో కాస్త ఈ చిత్రం జోరు కనిపిస్తున్నా కూడా మొదటి మూడు నాలుగు రోజుల వరకే ఈ సందడి కొనసాగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.ఓపెనింగ్స్‌ పరంగా ఈ చిత్రం సునామినే అని చెప్పుకోవాలి.కాని బాహుబలి రేంజ్‌ సునామి మాత్రం కాదని గట్టిగా చెప్పగలి.

బాహుబలి 2 రికార్డులు బద్దలవుతాయని భయపడ్డ తెలుగు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.శంకర్‌ మరోసారి బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నించాల్సిందే.

ఇండియన్‌ సినీ చరిత్రలో నిలిచి పోయిన బాహుబలి రికార్డులు బ్రేక్‌ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదని మరోసారి వెళ్లడయ్యింది.దీపావళికి వచ్చిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం కూడా బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేయలేక పోయిన విషయం తెల్సిందే.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు