మరోసారి రోబో కాంబో..!

సూపర్ స్టార్ రజినికాంత్ కెరియర్ లో రోబో సినిమా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.ఇప్పుడు ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది.

అంటే డైరక్టర్ శంకర్, రజిని కాంబినేషన్ అనుకుంటే పొరపడినట్టే.రోబో సినిమాలో రజిని సరసన నటించిన ఐశ్వర్య రాయ్ మరోసారి సూపర్ స్టార్ కి జోడీగా నటిస్తుందని తెలుస్తుంది.

రజిని 169వ సినిమా టాలెంటెడ్ డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఆల్రెడీ ఒక హీరోయిన్ కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ సెలెక్ట్ అవగా సినిమాలో రజినికి జోడీగా ఐశ్వర్య రాయ్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ రజినితో రోబో సినిమా చేసింది ఐశ్వర్య రాయ్ మళ్లీ రోబో కాంబో రిపీట్ కాబోతుంది.ప్రస్తుతం బీస్ట్ సినిమా హడావిడిలో ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ రజిని సినిమాని నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఆల్రెడీ టెస్ట్ షూట్ లో రజిని స్టైలిష్ లుక్స్ అందరిని సర్ ప్రైజ్ చేశాయి.ఈ మూవీలో రజిని కూతురి పాత్రలో ప్రియాంక నటిస్తుందని టాక్.

సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

Advertisement

తాజా వార్తలు