ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఏ సినిమాలో నటించినా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు.తెలుగులో దాదాపు అందరు హీరోలలో కలిసి నటించానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
నా వల్ల ఒకరు ఇబ్బంది పడటం ఇష్టం ఉండదని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.నాన్న డైరెక్షన్ చేయమంటే పైలట్ ఎపిసోడ్ డైరెక్షన్ చేశానని రాజీవ్ అన్నారు.
ఒకసారి నాన్న తను డైరెక్షన్ చేయాల్సిన సీన్లను తనతో చేయించారని రాజీవ్ పేర్కొన్నారు.
మా మదర్ 2018లో చనిపోయారని గుండెపోటు వల్ల చనిపోయారని రాజీవ్ అన్నారు.
ఈ ఘటన జరిగిన సంవత్సరంన్నర తర్వాత నాన్న కింద పడటంతో ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేశారని చెప్పుకొచ్చారు.సర్జరీ తర్వాత ఇంటిని హాస్పిటల్ లా సెట్ చేయాల్సి ఉండటంతో సెట్ చేశామని రాజీవ్ కనకాల అన్నారు.
ఆ తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఆగష్టు 2వ తేదీన చనిపోయారని రాజీవ్ తెలిపారు.

రాజీవ్ కనకాల తన సిస్టర్ శ్రీలక్ష్మీ మరణం గురించి చెబుతూ తనకు వ్యాధి అంతకు ముందే నిర్ధారణ అయిందని వ్యాధి నిర్ధారణ అయ్యే సమయానికి 4వ స్టేజ్ లో ఉందని అన్నారు.చెకప్ చేయించిన తరువాత సిస్టర్ రికవరీ అయ్యారని 85 శాతం రికవరీ అయ్యారని తెలిసి పూర్తిగా కోలుకుంటారని భావించానని రాజీవ్ కనకాల అన్నారు.మార్చి నెలలో లాక్ డౌన్ అమలు కాగా ట్రావెలింగ్ విషయంలో ఇబ్బందులు పడ్డానని రాజీవ్ అన్నారు.

2020 ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీలక్ష్మి మరణించారు.వరుస మరణాలు రాజీవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజీవ్ కనకాలకు సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతుండటం గమనార్హం.రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే.