రాజమౌళి ప్లాన్స్ వర్క్ అవుట్ అవుతాయా?

బాహుబలి రెండో భాగం వచ్చే సంవత్సరం విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ఈ లోపు రాజమౌళి తన ఎత్తుగడలను ప్రారంభించేసాడు.

బాహుబలి మొదటి భాగంలో ఉండే సెట్టింగ్స్ రెండో భాగంలో ఉండవని, కొత్త ఫోటోలను లీక్ చేస్తున్నాడు.అయితే బాహుబలి పార్ట్ 2కు సంబంధించి ఇస్తున్న లీకులు వికటిస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

సినిమాకి మంచి హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ లీక్ లను చేస్తుంది.బాహుబలి మొదటి భాగాన్ని తీసినప్పుడు మీడియాను కొంచెం దూరం పెట్టింది బాహుబలి టీం.దాంతో ఇప్పుడు మీడియా బాహుబలి రెండో పార్ట్ గురించి వార్తలను వ్రాయటం తగ్గించేసింది.లేటెస్ట్ గా బాహుబలి2 కొనడానికి వచ్చిన ఒవర్సీస్ బయ్యర్ వెనక్కు వెళ్లిపోయాడని టాక్.

అందుకే ఈ లీక్ లను జాతీయ మీడియాకు ఇవ్వటం ప్రారంభించింది బాహుబలి యూనిట్.కొత్త మాహిష్మితి రాజ్యం చూస్తారు అంటూ ఈ సినిమా పాత సెట్ ను మార్పులు చేర్పులు చేసి చూడని కొత్త యాంగిల్ లో కొత్త ఫొటోలు లీకులుగా వదుల్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఏది ఏమైనా ఈ లీక్ ల వ్యవహారం వికటించేలా ఉందని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్27, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు