ఆ క్షణంలో నా భార్యను చూసి ఏడ్చేశాను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

ఇకపోతే ఆయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలిచాయి.అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు రాజమౌళి.

తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి ఒకరు.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగామారిన రాజమౌళి అన్ని సూపర్ హిట్ సినిమాలను అందించారు.

అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.బాహుబలి,ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచారు.బహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించారు జక్కన్న.

Advertisement

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టారు.హాలీవుడ్ దర్శకులు కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు రాజమౌళి.ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో మగధీర సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించిన తెలిసిందే.

మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.కాగా రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్( Modern Masters ) అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది.ఈ డాక్యుమెంటరీలో చాలా విషయాలను పంచుకున్నారు రాజమౌళి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అలాగే మగధీర సినిమాకు సంబందించిన విషయాలను తెలిపారు.ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ.

Advertisement

మగధీర షూటింగ్ సమయంలో మాకు పెద్ద యాక్సిడెంట్ అయింది.మేము ఒక ఏరియాలో డ్రైవ్ చేస్తూ వస్తుంటే అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయింది.

మా వాళ్లందరికీ అందరికి గాయాలు అయ్యాయి.నా భార్య రమకి బాగా దెబ్బలు తగిలాయి.

నడుము కింద స్పర్శ కూడా పోయింది.పక్షవాతం వచ్చింది అనుకున్నాము.

దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు.దాంతో మాకు ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.

వెంటనే తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేశాను.అలా డాక్టర్స్ కు ఫోన్ చేస్తూ నా భార్యని చూస్తూ చాలా ఏడ్చేసాను అని తెలిపారు జక్కన్న.

ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయ్యిందని తెలిపారు.ఈ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు