'ఆర్‌ఆర్‌ఆర్‌' : ఆ మైలు రాయి చేరేనా? లేదా? క్లారిటీ వచ్చేసింది

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డు లను నమోదు చేసేందుకు రెడీ అవుతోంది.

బాహుబలి 2 స్థాయి రికార్డు లు ఈ సినిమా తరం కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

కానీ వెయ్యి కోట్లు సినిమా దక్కించు కుంటుంది అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా 850 కోట్ల వరకు వసూలు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న కారణం గా ఈ సినిమా ఇంకా 150 కోట్ల వసూళ్ల ను సొంతం చేసుకుంటుందా అనేది ప్రతి ఒక్కరి దృష్టి ని ఆకర్షిస్తుంది.ఒక వేళ ఈ సినిమా 1000 కోట్ల వసూళ్ల ను దక్కించుకుంటే కచ్చితంగా అది సంచలనమే అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలు రెండే రెండు వెయ్యి కోట్ల వసూళ్ల ను సొంతం చేసుకున్నాయి.ఇప్పుడు ఆ జాబితా లో ఈ సినిమా కూడా చేరుతుంది.

Advertisement

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమా తో సరికొత్త రికార్డు ను సృష్టించాడా లేదా అనేది ప్రతి ఒక్కరి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.అయితే సినిమా వసూళ్ల పరంగా కాకుండా టాక్‌ పరంగా మాత్రం చాలా పాజిటివ్గా వస్తుందని సమాచారం అందుతోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా వర్గాల వారు సినిమా కు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.కనుక మరో వీకెండ్‌ వరకు ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్ చేసి రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతుంది.

రికార్డు స్థాయి లో వసూళ్ల ను సొంతం చేసుకున్న ఈ సినిమా కచ్చితం గా సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేయడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది అనడం లో సందేహం లేదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు