మహేష్ ఫ్యాన్స్ ఆశలకు హద్దే లేదుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మహేష్ తన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ దూసుకువెళ్తున్నాడు.

కాగా తన నెక్ట్స్ మూవీని గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే తన నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఉండబోతుందని ప్రకటించాడు.

కాగా రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు చేయబోయేది ఎలాంటి సినిమా అనే సందేహం అందరిలో నెలకొంది.ఈ సినిమా హిస్టారికల్ సబ్జెక్ట్ అయి ఉండవచ్చనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారత్’ను తెరకెక్కించే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో ‘రామాయణం’ కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.దీంతో మహేష్ చేయబోయేది రామాయణం చిత్రమా అనే సందేహం పలువురిలో నెలకొంది.

Advertisement

కాగా దీనికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను ఏకంగా రాముడి అవతారంలో చూపెట్టేందుకు మహేష్ ఫోటోను రాముడి వేశంలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.రాముడి అవతారంలో ఉన్న మహేష్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే రాజమౌళి ఎప్పటికైనా చేసేది మహాభారతమే అని, రామాయణం ఆయన చేయకపోవచ్చని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు.ఏదేమైనా జక్కన్న-మహేష్ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో రానుందో ఇప్పటివరకు అనౌన్స్ చేయకపోయినా ఫ్యాన్స్ ఈ రకంగా తమ ఫేవరెట్ హీరోను రాముడి పాత్రలో ఊహించుకుంటుండటం నిజంగా వారి ఆశలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనకు తెలియజేస్తుంది.

Advertisement

తాజా వార్తలు