జక్కన్న నుండి అది ఆశించొద్దు అంటోన్న మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే వేసవిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.గతంలోనే ఈ సినిమా ఉంటుందని రాజమౌళి స్వయంగా ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే మహేష్ బాబు పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని వారు ఆశించారు.కానీ రాజమౌళి ఎప్పటిలాగే సైలెంట్‌గా ఉండిపోయాడు.

Advertisement

సాధారణంగానే జక్కన్న ఓ సినిమా చేస్తుండగా, తన నెక్ట్స్ మూవీని ఎప్పుడూ ప్రకటించలేదు.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన, ఎప్పటిలాగే తన ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.

దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో సినిమా గురించిన అప్‌డేట్ కోసం ఇప్పట్లో ఆశించొద్దని ఫిక్స్ అయ్యారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేస్తాడని, ఆ తరువాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తాడని వారు అంటున్నారు.

దీంతో మహేష్ ఫ్యాన్స్ ఒక్క క్లారిటీకి వచ్చారనే విషయం అర్ధం అవుతోంది.మరి జక్కన్నతో మహేష్ సినిమా గురించిన అప్‌డేట్ కోసం వారు ఎంతకాలం ఎదురుచూడాల్సి వస్తుందో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు