దర్శక ధీరుడు రాజమౌళి,( Rajamouli ) మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మనందరికీ తెలిసినదే.వృత్తి పరంగానే కాకుండా పెర్సనోల్ గా కూడా వీళ్లిద్దరు మంచి మిత్రులు.
వీళ్లిద్దరు కలిసి ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.తనకు కావాల్సిన అవుట్ ఫుట్ అడగకుండా ఇచ్చే ఒకే ఒక్క యాక్టర్ ఎన్టీఆర్ అని తన మనసులో ఎన్టీఆర్ మీదా ఉన్న అభిమానాన్ని ఆర్ఆర్ఆర్( RRR ) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టారు రాజమౌళి.
కానీ రాజమౌళి ఎన్టీఆర్ తో చేసిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 కి మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నందుకు చాలా బాధ పడ్డాడట.

ప్రతి దర్శకుడికి తాను దర్శకత్వం వహించే మొదటి సినిమా ఎంతో ప్రత్యేకం.మొదటి సినిమా మంచి యాక్టర్ తో అద్భుతంగా తెరకెక్కించాలని కసి, కోరిక ఉంటుంది ప్రతి దర్శకుడికి.రాజమౌళి కూడా అలానే అనుకున్నాడు.దర్శకేంద్రుడు….రాజమౌళి గురువు అయినా రాఘవేంద్ర రావు గారి( Raghavendra Rao ) వలన స్టూడెంట్ నెంబర్ 1 కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది రాజమౌళికి.
కానీ హీరో ని ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది.ఎందుకంటె అప్పటికే ప్రొడ్యూసర్లు ఆ సినిమా ఎన్టీఆర్ తో చెయ్యాలని నిర్ణయించుకున్నారు.స్టూడెంట్ నెంబర్ 1( Student Number 1 ) ఎన్టీఆర్ కు రెండో సినిమా మాత్రమే.అప్పుడు ఆయనకు 17 ఏళ్ళు మాత్రమే.
మూతి మీద మీసం కూడా రాలేదు అప్పటికి.

ఎన్టీఆర్ ను మొదటిసారి చూసినప్పుడు చాలా డిసప్పోయింట్ అయ్యారట రాజమౌళి.ఎన్నో కళలు కన్నా మొదటి సినిమా ఇలాంటి వాడు దొరికాడు అని బాధ పడ్డాడట.కానీ సినిమా షూటింగ్ మొదలైన 10 రోజులకే ఎన్టీఆర్ లోని టాలెంట్ ని గమనించాడట రాజమౌళి.
అప్పటి నుంచి అతనితో స్నేహం మొదలుపెట్టాడట.ఐతే ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్లాప్ సినిమాల గురించి మాట్లాడుతూ, రాజమౌళి ఎన్టీఆర్ వరుసగా నరసింహుడు,( Narasimhudu ) అశోక్,( Ashok ) వంటి హై ఆక్షన్ సినిమాలు చేసినప్పటికీ అవేవి సింహాద్రి ని( Simhadri ) మ్యాచ్ చెయ్యలేకపోయాయని అన్నారు.
తాను ఎన్టీఆర్ తో యమదొంగ( Yamadonga ) చెయ్యక ముందు రాఖి చిత్రం చెయ్యడం వలన అది కొంచెం బాలన్స్ అయ్యిందని అందుకే యమదొంగ మంచి విజయాన్ని సాధించిందని అన్నారు రాజమౌళి.







