రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయిన విశాల్ ఎస్ జే సూర్య లు కలిసి నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమా( Mark Antony ) మంచి విజయం సాధించేలా కనిపిస్తుంది.ఈ సినిమా సెప్టెంబర్ 15 వ తేదీన రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమా మీద మన ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఇంతకు ముందు దాకా ఎదురుచూసిన జనాలు కూడ ఉన్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే ఇంతకు ముందు కూడా తమిళ్ సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకోవడం మనం చూసాం…కానీ ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కి పోటీ గా చాలా సినిమాలే వస్తున్నాయి.మరి వాటన్నిటి పోటీ ని తట్టుకొని ఈ సినిమా హిట్ సాధిస్తుందా లేదా అని కూడా చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…

ఇక ఈ సినిమా అనే కాకుండా ఇండస్ట్రీ లోకి ఇంతకు ముందు వచ్చిన చాలా తమిళ్ సినిమాలు మంచి విజయాలను అండుకున్నప్పటికి ప్రస్తుతం విశాల్ కి తెలుగు లో ఒక మంచి హిట్ అయితే కావాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా విశాల్ కి తెలుగు లో( Vishal ) సరైన హిట్ లేదు అందుకే ఇప్పుడు ఈయనకి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి.

.ఇక ఎస్ జే సూర్య( SJ Surya ) కూడా మహేష్ బాబు తో చేసిన స్పైడర్ సినిమాలో విలన్ గా చేశాడు అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆయన చేసిన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది.ఇక ఈ సినిమా తో మరోసారి తెలుగు లో తన మార్క్ నటనతో ఎలా అలరిస్తాడో చూడాలి…మొత్తానికైతే ఈ సినిమా తో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.








