మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచినటువంటి వాటిలో రంగస్థలం( Rangasthalam ) సినిమా ఒకటి.అప్పటివరకు నటన పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రామ్ చరణ్ సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి నటనని కనపరిచారు ఇక ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రామ్ చరణ్ నటుడిగా తనని తాను నిరూపించుకున్నారని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి.అయితే రంగస్థలం కాంబినేషన్ తిరిగి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే త్వరలోనే సుకుమార్ చరణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయాన్ని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ చరణ్ కాంబినేషన్లో RC17 రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో గతంలో ఈ కాంబినేషన్ గురించి రాజమౌళి( Rajamouli ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి సుకుమార్ చరణ్ సినిమా గురించి కామెంట్స్ చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అందరికీ గుర్తుండిపోతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే సమయంలో తన బాడీ ఫిజిక్ ఎలాగా ఉందో సుకుమార్ సినిమాకి కూడా అదే విధంగా ఉండాలని చెప్పారట.అందుకే రాజమౌళి పర్మిషన్ తీసుకొని మరి సుకుమార్ చరణ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలోని కొన్ని సీన్లు చేశారంటూ గతంలో రాజమౌళి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక సుకుమార్ సినిమాల్లో కూడా చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో లాగా కనిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.