ఫస్ట్ టైం ఆ యాడ్ లో నటించబోతున్న రాజమౌళి... వైరల్ అవుతున్న వీడియో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Rajamouli Is Going To Act In That Ad For The First Time Details, Rajamouli,oppo-TeluguStop.com

ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) ఏ స్థాయిలో ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు (Oscar Award) రావడంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది.ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళి పని తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఎవరికైతే స్టార్ సెలబ్రిటీ హోదా ఉండి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి వారికి పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అంటూ ఎన్నో కంపెనీలు భారీగా ఆఫర్ చేస్తూ ఉంటాయి.అయితే ఇప్పటివరకు ఇలాంటి కమర్షియల్ యాడ్స్(Commericial Adds) లో దర్శకులు పెద్దగా నటించలేదని చెప్పాలి కానీ మొదటిసారి రాజమౌళికి ఇలాంటి అవకాశం రావడంతో ఈయన కూడా కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరిగాయని, ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో రాజమౌళి సూట్ వేసి అదరగొట్టేశాడు.స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ హంగామా చేశారు.ఐతే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు, ఇందులో రాజమౌళి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా మొదటిసారి ఒప్పో మొబైల్(Oppo Mobile) ఫోన్ కి రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో హీరోలకు రాజమౌళి ఏ మాత్రం తీసిపోరు అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube