తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్. ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్.
ఈ సారి 175 సీట్లలో మనం గెలవాలని సీఎం జగన్ సూచించారు.దీనికోసమే ఇన్ చార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు.
సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు, కార్పోరేషన్ సీటు ఇస్తారు.
రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు నాకు ఇవ్వాలని సీఎంను కోరా.
ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్లేందుకు సీఎం నాకు అవకాశం ఇస్తున్నారు.రాజమండ్రి సిటీలో మేము చేసిన అభివృద్ది గతంలో ఎక్కడా జరగలేదు.
రాజమండ్రి ఎంపీ సీటు ఈ సారి బీసీ అభ్యర్థికే సీఎం జగన్ ఇస్తారు.