సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి సపరేటుగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనంటే అందరికీ గౌరవం ఉంటుంది.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని,ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గాని అలాంటివి.మరి ముఖ్యంగా ఆయన జనసేన( Janasena ) అనే పార్టీని పెట్టి ప్రజలందరికీ సేవ చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
అందువల్లే ఆయన సినిమాలకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.సినిమాలు చేసిన కూడా అవి అడప దడప సినిమాలు చేస్తు ముందుకు కదులుతున్నాడు.
అయితే తను ఎక్కువ టైం పాలిటిక్స్ మీద కేటాయించే విధంగా తను షెడ్యూల్ చేసుకుంటున్నాడు.

ఇక అందులో భాగంగానే 2024 సమ్మర్ లో ఏపి ఎలక్షన్లు( AP Elections ) ఉండటం తో ఇప్పటి నుంచే తను క్యాంపెనింగ్ మొదలుపెట్టాడు.కొద్దిరోజులు సినిమాలకి బ్రేక్ ఇచ్చి చాలా బిజీగా తిరుగుతున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే తనదైన రీతిలో అవకాశం దొరికిన ప్రతిసారి మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఉన్న ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతుంటాడు అందుకే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాడు అంటే ఆయనని స్క్రీన్ మీద చూస్తే అభిమానులకు అదోరకమైన ఉత్సాహం కలుగుతుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే సుజిత్( Director Sujeeth ) డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్నా ఓజి సినిమాలో( OG Movie ) ఒక కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అయిన ప్రేమ( Heroine Prema ) నటిస్తుంది.సినిమా ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కావడం తో ఆ పాత్ర కోసం ఆమెని తీసుకున్నట్టు గా తెలుస్తుంది.అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ కావడంతో ఈ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తం రన్ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమాలో ప్రేమ క్యారెక్టర్ ఉండేది 5 నిమిషాలైనప్పటికీ సినిమా మొత్తం ఇంపాక్ట్ వేరే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







