సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ తర్వాత సినిమాలు చేసిన సెలెక్టివ్ గా మాత్రమే చేసేది.
అయితే విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ ను యధావిధిగా కొనసాగిస్తుంది.పుష్ప ఐటెం సాంగ్ తో సామ్ పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
ఈ పాట తర్వాత మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకున్న ఈమె ఈ మధ్యనే షూట్ లో పాల్గొంటుంది.
ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో చేరింది.
ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లు డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవలే మేకర్స్ ఈమె లుక్ షేర్ చేయగా సమంత మళ్ళీ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.ఇదిలా ఉండగా మేకర్స్ సామ్ రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేసారు.
ఈమె పాత్ర కోసం తమ టీమ్ తో పాటు సమంత కూడా ఫుల్ కెపాసిటీ ఉపయోగించ బోతుంది అని ఆమె కోసం కీలక సవాళ్లు ఎదురు చూస్తున్నాయి అని తెలిపారు.
అంతేకాదు ఈమె హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తుందని.సమంత రోల్ చాలా కఠినమైనది అని చెప్పుకొచ్చారు.ఇంటర్నేషనల్ సిరీస్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా పోషిస్తున్న పాత్రనే ఇక్కడ సామ్ పోషిస్తుంది.
ఇక ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తున్నారు.త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సిరీస్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
చూడాలి సమంతకు ఈ డైరెక్టర్లు మరో హిట్స్ ఇస్తారో లేదో.