ఇది వరకు రైల్వేకు సంబంధించిన ఏవైనా వివరాలు తెలుసుకోవాలంటే ప్రతి దానికి సెపరేట్‌గా నంబర్లు ఉండేవి.వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో భారత రైల్వే మంత్రిత్వ శాఖరైల్ మదద్‌ను ప్రారంభించింది.
ప్రయాణీకులకు మరింత సులభతరమైన ప్రయాణం చేయాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది.అందరి అవసరాలకు ఒకే హెల్ప్‌లైన్‌ను ముందుకు తీసుకువచ్చింది.
అదే 139 దీంతో రైల్వే ప్రయాణీకులు ఎంక్వైరీ చేయవచ్చు.కంప్లైయింట్ కూడా చేయవచ్చు.
ఈ ఫెసిలిటీ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.దాదాపు 12 భాషల్లో దీన్ని వినియోగించుకోవచ్చు.
వినియోగదారుల ఫిర్యాదులు, విచారణ సాయం కోసం ఈ వినూత్నమైన వన్ స్టాప్ సొల్యూషన్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది.ఇది వెబ్ యాప్, ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా, హెల్ప్‌లైన్(139) ద్వారా రైల్ మదాద్‌ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించింది.
దీంతో వారి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించనున్నారు.
ఐవీఆర్‌ఎస్ ద్వారా – మీకు భద్రత, వైద్య పరమైన సాయం కావాలంటే1నొక్కాల్సి ఉంటుంది.
దీంతో వెంటనే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటీవ్‌కు కనెక్ట్ అవుతుంది.– ఏదైనా సమాచారం కోరడానికి 2 ప్రెస్ చేయాలి.
అప్పుడు సబ్ మెనూ ఓపెన్ అవుతుంది.అందులో పీఎన్‌ఆర్ స్టేటస్, రైలు రాకపోకలు, వసతి ఛార్జీలు, విచారణ, టికెట్ బుకింగ్, టిక్కెట్ రద్దు, అలారం సదుపాయం, గమ్యస్థానానికి సంబంధించిన హెచ్చరిక, వీల్ చైర్ బుకింగ్, భోజనం పొందవచ్చు.
– సాధారణ ఫిర్యాదుల కోసం 4 ప్రెస్ చేయాలి.– విజిలెన్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల కోసం ‘5’ నొక్కాలి.
– మీ వస్తువులు, పార్శిల్స్‌కు సంబంధించిన ప్రశ్నల కోసం ప్రయాణీకులు ‘6’ ను ఎంచుకోవాలి.– ఐఆర్‌టీసీ ద్వారా రాకపోకలు చేపట్టే రైళ్ల ఎంక్వైరీ కోసం ‘7’ నొక్కాలి.
– ప్రయాణీకులు చేసిన ఫిర్యాదుల ప్రస్తుత స్థితి కోసం ‘9’ నొక్కాల్సి ఉంటుంది.– కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్‌తో మాట్లాడాలనుకుంటే 0 నొక్కాలి.

ఈ 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు సగటున 3,44,514 మంది కాల్ లేదా ఎస్‌ఎంఎస్ చేస్తారని రైల్వే మింత్రిత్వశాక తెలిపింది.సోషల్ మీడియాలో కూడా వన్ రైల్ వన్ హెల్ప్‌లైన్ 139 ని షేర్ చేసింది.రాజ్యసభ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం మేరకు 99.93 శాతం ఫిర్యాదులు వెంటనే క్లోజ్ చేస్తారు.ఫిర్యాదుదారుల ఇచ్చిన అభిప్రాయం 2020–21 అద్భుతంగా ఉన్నాయని అన్నారు.