జూన్ నెలలో హైదరాబాద్ కి రానున్న రాహుల్, ప్రియాంక, సోనియా..!!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణపై దృష్టి పెట్టనున్నట్లు కొన్ని వారాల క్రితమే రాహుల్ గాంధీ( Rahul Gandhi ) టీ కాంగ్రెస్ నేతలకు మాట ఇవ్వటం జరిగింది.

ఇప్పుడు ఆ రీతిగానే కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కీలక నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ సభకు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) రావటం జరిగింది.కాగా ఇప్పుడు జూన్ నెలలో హైదరాబాదు నగరానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాబోతున్నారు.

బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు.ఇటీవలే ఆ భవనానికి కంటోన్మెంట్ బోర్డు అనుమతి ఇవ్వడం జరిగింది.

కాగా అదే రోజు 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో యువతకి ఎలక్ట్రిక్ స్కూటీని పంపిణీ చేయబోతున్నారు.  త్వరలో తేదీని టీ కాంగ్రెస్ నేతలు ప్రకటించనున్నారు.ఈ ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో చాలావరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పెద్దలు సంతోషంగా ఉన్నారట.

ఇప్పుడు ఇదే జోరు తెలంగాణలో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు