మరోసారి తెలంగాణకు రాహూల్ గాంధీ..?

తెలంగాణాలో బీజేపీ జెండా ఎగరేయాలని యత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుందంటున్నారు విశ్లేషకులు.

మరో మాటగా చెప్పాలంటే బీజేపీకి ఉన్న ఆత్మ విశ్వాసం కాంగ్రెస్ లో అంతగా కనిపించడం లేదనేది ఆపార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పలు సందేహాలు.

అందుకే ఆపార్టీ అధిష్టానంలో సోనియమ్మ స్పీడు తగ్గినా, రాహూల్ స్పీడు పెంచే విధంగా హస్తం యంత్రాంగం సన్నద్ధ మవుతుంది.ఈ నేపథ్యంలోనే గత మే నెలలో రాహూల్ గాంధీని తెలంగాణాకు రప్పించింది రాష్ట్రా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం.

గత మే నెల 5 వ తేదిన వరంగల్ వచ్చిన రాహూల్ గాంధీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపే ప్రయత్నాలు శక్తి వంచన లేకుడా చేసారనడంలో సందేహంలేదు.అప్పటి సభలో రైతు అంశాలే ఎజెండాగా తీసుకున్న కాంగ్రెస్.

అధికారంలోకి వస్తే తాము తెలంగాణాకు ఏం చేయదలచుకున్నామనే అంశాలను డిక్లరేషన్ ద్వారా ప్రజలకు ఏకరువు పెట్టారు.రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఏ పంటలు వేసినా వాటికి అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటల ఆధారంగా కొనుగోళ్ల ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను రూతుల కళ్లకు 70 ఎంఎంలో చూపించింది.

Advertisement

రాహూల్ గాంధీ రాకతో తెలంగాణా కాంగ్రెస్ లో జోష్ పెరుగుతుందనే అభిప్రాయాలు ఆపార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇతవరకూ బాగానే ఉంది.వచ్చిన చిక్కెల్లా ప్రధాని మోదీ చరీష్మాతోనే కాంగ్రెస్ లో పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.మరో మాటగా చెప్పాలంటే తెలంగాణాలోనే కాదు దేశ వ్యాప్తంగా మోదీ క్రేజ్ ముందు రాహూల్ గాంధీ క్రేజ్ అంత పెద్దగా కనిపించడంలేదనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మోదీ విజయభేరీ సభ ఘనవిజయం సాధించడంతో ఇపుడు కాంగ్రెస్ మరోసారి ఆలోచనలో పడింది.తెలంగాణ గడ్డమీద ఏకచత్రాధిపత్యంగా రాజ్యమేలుతున్న టీఆర్ఎస్ ను గద్దె దింపే లక్ష్యంతోనే మరోసారి రాహూల్ గాంధీని హైదరాబాద్ కు రప్పిస్తుంది.

తాజాగా ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీతో నూతన ఉత్సాహాన్ని గమనించిన కాంగ్రెస్ మరోసారి రాహూల్ గాందీ అస్త్రాన్ని తెలంగాణ గడ్డపై ప్రయోగించనుంది.ఈసారి ఇక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్, వెర్సస్ రాహూల్ గాంధీగా రాజకీయ నేతలు అభివర్ణిస్తున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

దాంతో బీజేపీ కంటే కాంగ్రెసే ది బెస్ట్ అనిపించుకునే ప్రయత్నాలు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఆధ్వర్యంలో జరిపించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.మరో వైపు తెలంగాణలో రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నది ఎవరో, 12 నెలల్లో తేలిపోనుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Advertisement

మరి తెలంగాణ గడ్డమీద గులాబి గుబాలింపా? కమలం వికాసమా? లేదా హస్తవాసా అనేది తేలిపోనుంది.

తాజా వార్తలు