టాలీవుడ్ బుల్లితెరపై సుధీర్, రష్మీ జంట గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఈ జంట బుల్లితెరపై చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు.
తమ రొమాన్స్ తో రచ్చ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు.పైగా వీరి మధ్య రిలేషన్ గురించి బయట కూడా నానారకాలుగా మాట్లాడేసుకున్నారు జనాలు.
ఈ జంట తొలిసారిగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి పరిచయమయ్యారు.ఇక రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సుధీర్ స్టార్ కమెడియన్ గా నిలిచి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.వీరిద్దరూ జబర్దస్త్ షో లో చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అలా జబర్దస్త్ షో లో ఈ జంట బాగా హైలెట్ గా నిలిచింది.
నిజానికి వీళ్ళ మధ్య ఉన్న బంధం చూసినట్లయితే వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానం రాక తప్పదు.
వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ చాలాసార్లు వినిపించింది.ఈ షో లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమౌతున్న పలు షోలలో కూడా ఈ జంట బాగా రచ్చ చేస్తుంటారు.
ఇక గతంలో బుల్లితెర వేదికగా వీరి పెళ్లి కూడా చేశారు మల్లెమాల ప్రొడక్షన్.ఎన్నోసార్లు వీరి మధ్య మంచి ప్రపోజల్ సన్నివేశాలు కూడా జరిగాయి.
రొమాంటిక్ డాన్స్ లతో మాత్రం ప్రేక్షకులను తమవైపు లాక్కున్నారు ఈ జంట.దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ జంట మంచి అభిమానంగా మారటంతో.

వీరి పేరు పైన సోషల్ మీడియాలో ఎన్నో ఖాతాలు సృష్టించి వాటి వేదికగా తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంటారు తమ అభిమానులు.ఈ జంట కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమైన లాస్ట్ సీజన్ ఢీ డాన్స్ షో లో కూడా టీం లీడర్ గా చేశారు.అందులో కూడా వీరి మధ్య రొమాన్స్, డైలాగ్స్ బాగా పేలాయి.చాలావరకు ఈ షోలను సుధీర్, రష్మీ ల కోసం చూస్తూ ఉంటారు అభిమానులు.ఇక కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా వీరిపై ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.అలా తాజాగా సుధీర్, రష్మీ ల జంట మధ్య మరో మీమ్ బాగా వైరల్ అవుతుంది.
అందులో వారిద్దరూ ఒక పాపని ఎత్తుకొని ఉన్నట్లు ఒక ఫోటో ను ఎడిట్ చేశారు ఎడిటర్లు.

ఇక దానికి రష్మీ కూడా ఎడిటర్లను ఆ పాప పేరు ఏంటో చెప్పండి అంటూ ఒక మీమ్ కూడా క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఆ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్ లు తెగ లైక్ లతో పాటు కామెంట్లు పెడుతున్నారు.
ఇక కొందరు వీరిద్దరూ మళ్ళీ కలిసి స్టేజ్ షో చేస్తే బాగుండు అని కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.