మరో బిల్లుపై రాహుల్‌ ఫైర్‌

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరో కేంద్ర బిల్లుపై నిప్పులు కురిపించారు.

భూసేకరణ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాహుల్‌ ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ బిల్లును దుయ్యబడుతున్నారు.

ఇది బిల్డర్లకు అనుకూలమైన బిల్లని రాహుల్‌ అన్నారు.ఈ బిల్లులోని ఢిల్లీలో అనేకమంది అపార్టుమెంటు కొనుగోలుదారులతో సమావేశమైన రాహుల్‌ ఆ తరువాత ప్రభుత్వం విమర్శలు చేశారు.

ఈ బిల్లు రైతులకు, గిరిజనులకు మాత్రమే నష్టదాయకం కాదని మధ్య తరగతి ప్రజలకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని చెప్పారు.భూమికి సంబంధించిన హక్కల విషయంలో మధ్యతరగతి ప్ర జల హక్కలను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ బిల్లులో పారదర్శకత లేదన్నారు.తాను ఇళ్ల కొనుగోలుదారుల పక్షాన ఉండి పోరాటం చేస్తానన్నారు.

Advertisement

ఫలాన రోజు మీకు ఫ్లాట్‌ వస్తుందని చెబుతారని, కాని ఏళ్లు గడిచినా రాదని, సూపర్‌ డూపర్‌ ప్రాంతంలో ఫ్లాట్‌ ఉంటుందని చెబుతారని, కాని అది తేడాగా ఉంటుందని రాహుల్‌ అన్నారు.మొత్తం మీద రాహుల్‌ మోదీ సర్కారు బిల్లులను ఎండగడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారా?.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు