ఏపీలో ఇప్పుడు రాజకీయాలు జోరమీదున్నాయి.మొన్నటి వరకు ఎంపీ రఘురామ ప్రభుత్వానికి షాక్‌లు ఇస్తే… ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎంపీ రఘురామకు వరుస షాక్‌లు ఇస్తోంది.
రఘురామ బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలిసి వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై ఫిర్యాదులు చేశారు.అలాగే ఇతర రాష్ట్రాల సీఎంలకు, తన తోటి ఎంపీలకు లేఖలు రాసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టారు.
ఇక దీన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్.ఏకంగా ఆయనే రంగంలోకి దిగారు.సడెన్‌గా ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు.అయితే అసలు విషయం చెప్పకుండా తన పని తాను చేసుకుపోయారు.
ఎప్పుడైతే ఆయన ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందో అప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు.అమరావతి వచ్చిన మరుసటి రోజే పార్టీ చీఫ్ విప్ అయిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కుమార్‌తో ప్లాన్ అమలు చేయించారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు భరత్ ద్వారా ఫిర్యాదు చేయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ కోరడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.

ఇక దీని తర్వాత వైసీపీ అధికార వెబ్‌సైట్ నుంచి రఘురామ పేరును తొలగించడం కూడా కల్లోలం రేపింది.దీంతో వైసీపీ నుంచి రఘురామను తొలగిస్తున్నట్టు జగన్ ఇండికేషన్ ఇచ్చారు.అయితే ఈ రెండు షాక్‌లతో ఎంపీ రఘురామ కాస్త కంగుతిన్నట్టు అర్థమవుతోంది.
ఇదే విషయంపై ఎంపీ రఘురామ మాట్లాడుతూ తన పదవిపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ కాదంటూ చెప్పుకొచ్చారు.అంటే పదవి పోతుందనే భయం ఎంపీ స్పష్టంగా కనిపిస్తోంది.
పైగా తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదని, తనపై వచ్చిన ఫిర్యాదును తీసుకోవద్దంటూ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేయటమే ఎంపీ భయానికి నిదర్శనంగా కనిపిస్తోంది.