గత కొద్ది నెలల నుండి ఏపీ సీఎం జగన్ కి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనేక విషయాల గురించి లెటర్లు రాస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని లెటర్లో సూచనలు మరికొన్ని లెటర్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ రఘురామకృష్ణంరాజు లెటర్లు రాయగా తాజాగా.
వైయస్ జగన్ కు మరో లెటర్ రాయడం జరిగింది.విషయంలోకి వెళితే తాజా లెటర్ లో విశాఖ భూముల కుంభకోణం గురించి ప్రస్తావించడం జరిగింది.

ఈ భూముల కుంభకోణం ప్రత్యేకత దర్యాప్తు బృందం ఇటీవల ఇచ్చిన నివేదిక ఆధారంగా.ప్రభుత్వం విచారణ జరిపించాలని.కుంభకోణానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విశాఖలో జరుగుతున్న ప్రతి విషయం ప్రజలందరికి తెలిసేలా సీఎం జగన్ బాధ్యత వహించాలని సూచించారు.ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటువంటి రాజకీయ నాయకులు అదే రీతిలో అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని.ఎటువంటి భేషజాలు లేకుండా దర్యాప్తు.ప్రభుత్వం చేయించాల్సిన అవసరం ఉంది అని సీఎం జగన్ కి రఘురామ కృష్ణంరాజు తెలిపారు.