గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయ్యి విడుదల అయిన ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపించడం లేదు.కాగా కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తున్నా ఓపికతో భరించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఆ పార్టీ రెబల్ ఎంపీ గా పిలవబడుతున్న రఘురామకృష్ణ రాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న రఘురామ ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించినందుకు తనపై కేసులు పెట్టారని, తనపట్ల ఏపీ సీఎం వ్యక్తిగత కక్షతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని, అంతే కాకుండా ఓ సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడం ఎంత దారుణమో ఇప్పటికైన ఏపీ ప్రజలు అర్ధం చేసుకోవాలంటూ విమర్శించారు.ఇలా తన పై అక్రమ కేసులు పెట్టి క్రూరంగా హింసించడం వల్ల ప్రభుత్వానికి కలిగే ఆనందం ఏంటో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.