Raghavendra Rao Balakrishna: వర్షాకాలం అయితే చినుకులు జై బాలయ్య అంటూ శబ్దం చేస్తాయి.. ఏపీలో వచ్చేది ఆ పార్టీ అంటూ?

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇటీవలె భగవంత్ కేసరి సినిమాతో( Bhagavanth Kesari ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది.అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య బాబు.

కాగా ఆ మూవీలో శ్రీలీల( Sreeleela ) బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఈ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా నేడు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.ఈ వేడుకకి రాఘవేంద్ర రావు అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు వేదికపై మాట్లాడుతూ.చేసిన పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) మాట్లాడుతూ.ఈ సినిమాలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని అన్నారు.బాలయ్య డైలాగ్ చెబితే బాంబు పేలినట్లుగా ఉంటుందని, కానీ బాంబు కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను.

బాలయ్యకి సీజన్ తో సంబంధం లేదు.వర్షాకాలం అయితే చినుకు జై బాలయ్య( Jai Balayya ) అంటూ శబ్దం చేస్తాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

వేసవిలో సూర్య కిరణాలు కూడా జై బాలయ్య అంటూ వస్తాయి.చలికాలంలో పిల్లగాలికి పచ్చ జెండాలు జై బాలయ్య అంటూ రెపరెపలాడతాయి.

Advertisement

హిందూ పురంలోనే కాదు ఆంధ్ర మొత్తం పచ్చ జెండాలు రెపరెపలాడతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా రాఘవేంద్రరావు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నెటిజన్స్ ఏపీలో నెక్స్ట్ వచ్చేది టీడీపీ.

( TDP ) రాఘవేంద్రరావు కూడా అదే విషయాన్ని హింట్ ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు