కాంచన 4 గురించి స్పందించిన లారెన్స్... మరోసారి అందరిని భయపెట్టబోతున్నారా?

రాఘవ లారెన్స్( Raghava Lawrence ) తాజాగా చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

ఇక ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను సాధించలేకపోవడంతో లారెన్స్ తన తదుపరి సినిమా పనులలో బిజీ అయ్యారు.ఇక ఈయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా లారెన్స్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన చంద్రముఖి 2 గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కాంచన 4 ఎప్పుడు వస్తుంది అంటూ విలేకరులు ఈయనని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.

Advertisement

ఇప్పటికే కాంచన ( Kanchana )సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులందరిని భయపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా నాలుగవ భాగం కూడా రాబోతుందనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం తెలిపారు.

ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తాను అన్ని దయ్యం సినిమాలు తీసుకుంటూ పోతూ ఉండటం వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని తెలిపారు.నాకు రాత్రిపూట కలలో కూడా అవే కనిపిస్తున్నాయని, చాలా భయంగా ఉంటుందని ఈయన వెల్లడించారు అందుకే ఇప్పుడప్పుడే తాను కాంచన 4 ( Kanchana 4 )గురించి ఎలాంటి ఆలోచనలు చేయలేదని లారెన్స్ తెలిపారు.ఇక ఈ సినిమా తప్పకుండా వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుంది అంటూ కాంచన 4 గురించి లారెన్స్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే భవిష్యత్తులో తప్పకుండా కాంచన 4 వస్తుందని మరోసారి ఈయన ప్రేక్షకులను భయపెట్టడం ఖాయం అంటూ కొందరు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు