అప్పుడు అందంగా ఉండేదాన్ని కాదు.. రాధిక కీలక వ్యాఖ్యలు..?

తెలుగు, తమిళ భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు రాధికా శరత్ కుమార్.

సినిమాలతో పాటు సీరియళ్లలోను నటించడంతో పాటు సీరియళ్లను నిర్మించిన రాధిక రాజకీయాల్లో కూడా బిజీ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా శరత్ కుమార్ హీరోల రెమ్యునరేషన్ గురించి, వయస్సు పెరిగినా సీనియర్ హీరోలు హీరో రోల్స్ లో మాత్రమే నటించడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో హీరోలకు రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.60 సంవత్సరాల వయస్సు దాటినా సినిమాల్లో హీరోగా చేయవచ్చని కానీ 40 సంవత్సరాల వరకు మాత్రమే హీరోయిన్ గా చేసే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.ఇండస్ట్రీలో 30 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లకు అక్క, వదిన తరహా పాత్రలు 40 ఏళ్లు దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారని రాధిక అన్నారు.

ఈ కారణాల వల్లే సినిమాల్లో ఒకవైపు బిజీగా ఉన్న సమయంలోనే తాను సినిమాలను, సీరియళ్లను నిర్మిస్తూ వ్యాపారవేత్తగా మారానని ఆమె తెలిపారు.ఫ్యూచర్ లో రజనీకాంత్ కు అమ్మగా నటించమని తనకు ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాధిక తెలిపారు.

ఇండస్ట్రీలో నటులకు సంబంధించి ముందస్తు ఆలోచనలు ఉండవని కానీ నటీమణులకు సంబంధించి నిర్ధిష్టమైన ఆలోచనలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తన సినీ ప్రయాణం సులభం అని చాలామంది అనుకుంటారని.కానీ ఈ ప్రయాణంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని రాధిక చెప్పుకొచ్చారు.ఒక డైరెక్టర్ తనను సినిమాల్లో నటించమని కోరగా తాను అప్పుడు అందంగా ఉండేదాన్ని కాకపోవడంతో నా ముఖంను ఎవరు చూస్తారని ఆయనతో అన్నానని కానీ కెమెరా ముందుకు వచ్చి ఇంతదూరం వచ్చానని ఆమె అన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు