Raavan Srinikitha Alipiriki Allantha Dooramlo Review: అలిపిరికి అల్లంత దూరంలో రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

ఆనంద్ జె దర్శకత్వంలో రూపొందిన సినిమా అలిపిరికి అల్లంత దూరంలో.

ఈ సినిమాలో రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మ కంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ, వేణుగోపాల్ తదితరులు నటించారు.

ఈ సినిమాను కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి లు నిర్మించారు.ఫణి కళ్యాణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

అయితే ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఆనంద్ తనతో పాటు కొత్త నటీనటులతో సినిమా రూపొందించాడు.ఇక ఈ సినిమా యూనిక్ రాబరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.

ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

రావణ్ నిట్టూరు వారధి పాత్రలో నటించాడు.ఇక ఇతడు తిరుపతిలో ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి.

Advertisement

ఇతడికి డబ్బు పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.ఫైనాన్స్ పరంగా ప్రాబ్లం లో ఉన్న ఇతడు చిన్న చిన్న మోసాలు చేస్తూ దేవుడు ఫోటోలు అమ్మే షాపును రెంటుకు తీసుకొని ఇప్పిస్తున్నాడు.

ఇక అక్కడే వెంకటేశ్వర గోశాలలో వాలంటరీగా పనిచేసే ధనవంతుల కూతురు కీర్తి (శ్రీ నికిత) ను చూసి ఇష్టపడతాడు వారధి.ఇక కీర్తి కూడా వారధిని ఇష్టపడుతుంది.

అయితే వీరిద్దరి ప్రేమించుకుంటున్న విషయం కీర్తి తండ్రికి తెలుస్తుంది.అతడు వారధి దగ్గరికి వెళ్లి.

చదువు లేకపోయినా నీ దగ్గర డబ్బు అయినా ఉంటే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే వాడిని అని.కనీసం నీ దగ్గర డబ్బు కూడా లేదు అంటూ ఇకపైన కూతురు జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

దాంతో వారధి ఎలాగైనా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.అయితే ఆ సమయంలో వెంకటేశ్వర స్వామికి రెండు కోట్ల ముడుపులు మొక్కు చెల్లించుకోవడానికి ఓ యాత్రికుడు వస్తాడు.ఇక ఆ విషయం తెలుసుకుని వారధి ఆ డబ్బులు కొట్టేసి బాగా సెటిల్ అయ్యి కీర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.

Advertisement

డబ్బులు కొట్టే సమయంలో తను కొన్ని విషయాలలో ఇరుక్కుని ఇబ్బందులు పడతాడు.ఇంతకు ఆ ఇబ్బందులు ఏంటి.చివరికి ఆ యాత్రికుడు డబ్బులు తీసుకుంటాడా లేదా.

తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

రావణ్ తొలిసారిగా హీరోగా పరిచయమైనప్పటికీ కూడా వారధి పాత్రలో అద్భుతంగా నటించాడు.చాలా న్యాచురల్ గా కూడా కనిపించాడు.

హీరోయిన్ శ్రీ నికిత కూడా తన పాత్రతో మంచి మార్కులు సంపాదించుకుంది.ఇక మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా.డైరెక్టర్ ఆనంద్ సినిమాలు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తీసుకొని వచ్చాడు.ఇక ఈ సినిమాను తిరుపతిలో బాగా షూట్ చేశారు.

ఫణి కళ్యాణ్అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.

మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

ఈ సినిమాను డైరెక్టర్ ఒక కుర్రాడి జీవితంలో జరిగిన విషయాలను అద్భుతంగా చూపించాడు.ఇక ఈ సినిమా మొత్తాన్ని తిరుపతిలో చూపించడం బాగా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కథ, లొకేషన్, మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది అని అర్థమవుతుంది.

రేటింగ్: 2.75/5

" autoplay>

తాజా వార్తలు