Srisatya Monal : ఆ కంటెస్టెంట్ కు సహాయం చేస్తున్న బిగ్ బాస్.. మరో మోనాల్ అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చిన కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లో కొనసాగుతారని ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్లు జరుగుతాయని చాలామంది కంటెస్టెంట్లు భావిస్తారనే సంగతి తెలిసిందే.

 Bigg Boss Help To Contestant Srisatya Details Here Goes Viral , Bigg Boss , Sr-TeluguStop.com

గతంలో మోనాల్ కు బిగ్ బాస్ నిర్వాహకులు చాలా సపోర్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ సీజన్ లో కూడా శ్రీసత్యకు బిగ్ బాస్ నిర్వాహకులు సపోర్ట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన శ్రీసత్యను కాపాడటానికి బిగ్ బాస్ ప్లాన్ చేశాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రీసత్యతో లవ్ ట్రాక్ నడపాలని కొంతమంది కంటెస్టెంట్లు ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.

ప్రస్తుతం శ్రీహన్ శ్రీసత్య సన్నిహితంగా మెలుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఇప్పటికే శ్రీసత్య ఎలిమినేట్ కావాల్సి ఉందని అయితే బిగ్ బాస్ సపోర్ట్ ఉండటం వల్ల ఆమె ఎలిమినేషన్ జరగడం లేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ఆమెను కాపాడటానికి శ్రీసత్య పీఆర్ టీం ఎంతగానో కష్టపడుతోంది.గ్లామర్ బ్యూటీ కావడంతో శ్రీసత్యను బిగ్ బాస్ కాపాడుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss, Monal, Sri Satya, Srihan Srisatya, Srisatya Pr-Movie

బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు.బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీసత్య మరో మోనాల్ అని కొంతమంది చెబుతున్నారు.శ్రీసత్యపై ప్రేక్షకుల్లో కూడా రోజురోజుకు నెగిటివ్ ఒపీనియన్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.బిగ్ బాస్ షో ద్వారా శ్రీసత్యకు భారీగానే రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube