పెళ్లికి రెడీ అయిన రాశిఖన్నా.. ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానంటూ సీక్రెట్ రివీల్..!!

హిందీ చిత్రం మద్రాస్ కెఫె( Madras Cafe ) అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన రాశి ఖన్నా ( Raashii khanna ) ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా టాలీవుడ్ రంగానికి పరిచయమైంది.

ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా నాగశౌర్య హీరోగా చేశారు.

ఈ సినిమాతో రాశిఖన్నాకి కాస్త క్రేజ్ వచ్చినప్పటికీ సుప్రీమ్ ( Supreme ) , హైపర్ వంటి సినిమాలతో రాశిఖన్నా రేంజ్ మారిపోయింది అని చెప్పవచ్చు.ఈమె ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్( Star heroine ) మాత్రం అవ్వలేదని చెప్పుకోవచ్చు.

దానికి ప్రధాన కారణం ఒకానొక సమయంలో రాశి ఖన్నా చాలా లావు పెరిగిపోయింది.

Raashii Khanna Who Is Ready For Marriage, Raashii Khanna, Madras Cafe, Hyper,

దాంతో కెరియర్ పీక్స్ లో ఉండగానే దర్శక నిర్మాతలు( Director Producers ) ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.ఇక ఈ కారణంతో కూడా రాశి ఖన్నా అవకాశాలు కోల్పోయింది అని చెప్పవచ్చు.అయితే ఇదంతా పక్కన పెడితే.

Advertisement
Raashii Khanna Who Is Ready For Marriage, Raashii Khanna, Madras Cafe, Hyper,

తాజాగా రాశి ఖన్నా తాను ప్రేమలో ఉన్నానని డేటింగ్ చేస్తున్నాను అనే సీక్రెట్ ని రివీల్ చేసింది.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

ప్రజెంట్ నేను ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాను.

Raashii Khanna Who Is Ready For Marriage, Raashii Khanna, Madras Cafe, Hyper,

అతనితో డేటింగ్ కూడా చేస్తున్నాను.ఇక ఆ వ్యక్తి నా అభిప్రాయాలని గౌరవిస్తున్నాడు.ఒకరికి నచ్చినవి ఏంటో మరొకరం తెలుసుకొని గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ మా రిలేషన్ ని కొనసాగిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు గతంలో తనకి అవకాశాలు రాకపోవడానికి కారణం లావుగా మారడమేనని, అయితే నేను ఓ వ్యక్తి తో ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలం అయ్యేసరికి చాలా బాధలో ఉండిపోయి చివరికి ఏం చేస్తున్నానో నాకే తెలియక ఒక్కసారిగా లావెక్కాను.దాంతో తెలియకుండానే నాకు అవకాశాలు చేజారిపోయాయి.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఆ తర్వాత ఎన్ని విధాల బరువు తగ్గాలని ట్రై చేసినా తగ్గలేకపోయాను.కానీ ఎప్పుడైతే నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడి డేటింగ్ చేస్తున్నానో అప్పటినుండి నేను సులువుగా బరువు తగ్గిపోయాను అంటూ తాను ప్రేమలో ఉన్న సీక్రెట్ ని బయటపెట్టింది రాశి ఖన్నా .

Advertisement

తాజా వార్తలు