Raashi Khanna: రాశి ఖన్నాలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఏకంగా కాజల్ నే ఫిదా చేసిందిగా?

మామూలుగా హీరో హీరోయిన్స్ లకు కేవలం నటన పరంగానే కాకుండా కొన్ని రకాల టాలెంట్ లు కూడా ఉంటాయి.

చాలావరకు అవి సందర్భం బట్టి బయటపడుతూ ఉంటాయి.

ఎక్కువగా వాళ్లలో సింగర్స్( Singers ) ఉంటారని చెప్పాలి.ఇప్పటికీ కొంతమంది హీరో హీరోయిన్స్ తమ సినిమాలలో స్వయంగా తామే పాటలు పాడి వినిపించారు.

మరి కొంతమందికి సినిమాలకు దర్శకత్వం వహించే టాలెంట్ కూడా ఉంటుంది.అయితే రాశిఖన్నా లో( Raashi Khanna ) కూడా ఒక టాలెంట్ ఉండగా తన టాలెంట్ తో కాజల్ ని( Kajal Aggarwal ) ఫిదా చేసింది.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా.

Advertisement

తక్కువ సమయంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్ లతో బిజీగా మారింది.

నిజానికి బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.

మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో తను తీయించుకున్న ఫోటోషూట్లని వెంటనే పంచుకుంటూ ఉంటుంది.ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు తక్కువగా రావటంతో చాలా గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ లేకుండా ఫోటోలు షేర్ చేస్తూ వారికి బాగా దగ్గర్లో ఉందని చెప్పాలి.అప్పుడప్పుడు జువెలరీ ప్రకటనలలో కూడా కనిపిస్తూ ఉంటుంది.ఇక అప్పటిలాగా ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.

Advertisement

కానీ అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తుంది అని చెప్పాలి.ఇక రాశి ఖన్నా లో మరో టాలెంట్ కూడా ఉందని చెప్పాలి.

తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకుంది.

అదేంటంటే సాయి ధరమ్ తేజ్,( Saidharam Tej ) కలర్ స్వాతి( Colors Swathi ) కలిసి నటిస్తున్న ద సోల్ ఆఫ్ సత్య( The Soul Of Satya ) అనే షార్ట్ ఫిలిం కు సంబంధించిన ఒక పాటను రాశి ఖన్నా పాడుతూ కనిపించింది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా పాడినట్లు తెలిసింది.ఇక తన గొంతు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.

ఇక ఆమె పాటకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.కాజల్ అగర్వాల్ కూడా తన వాయిస్ కి ఫిదా అయింది.

ఇక ప్రతి ఒక్కరికి తన గొంతు నచ్చటంతో తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు