విడాకుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. పిల్లల ముందే భార్యపై దారుణం..!

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో శుక్రవారం జరిగిన హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది.అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ విడాకులు ఇవ్వాలంటూ భార్యతో తరచూ గొడవపడేవాడు.

ఈ క్రమంలో గొడవను అడ్డుకోబోయిన 14 ఏళ్ల కుమారుడిని చంపేందుకు ప్రయత్నించాడు.కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

తరువాత కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.వివరాల్లోకెళితే.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహుల గూడేనికి చెందిన కుంచం రవికుమార్( Kuncham Ravikumar ) (38) కు 2010లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది.తరువాత జనగామ జిల్లా దేవరప్పులకు చెందిన శోభా( Shobha )(37) తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

Advertisement

వీరికి 14, 10 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు సంతానం.గతంలో యాదగిరిగుట్టలో నివాసం ఉన్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా శోభ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు రాజ్ కుమార్( Raj Kumar ) కౌన్సిలింగ్ ఇచ్చారు.

నాలుగేళ్ల క్రితం రాజ్ కుమార్ హైదరాబాద్ నగరానికి బదిలీ అయ్యి హైకోర్టు వద్ద కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య పిల్లలతో కలిసి వనస్థలిపురం గౌతమినగర్ లో నివాసం ఉంటూ తరచూ మద్యం సేవించి విడాకులు ఇవ్వాలంటూ భార్యను వేధించేవాడు.

మూడు రోజుల నుండి గొడవ జరుగుతూ ఉండడంతో శోభ మహేశ్వరంలోని తన బంధువుల ఇంటికి వెళ్ళింది.ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియడంతో రాజ్ కుమార్ కు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు.గురువారం శోభ ఇంటికి వచ్చింది.

రాజ్ కుమార్ విధులు నిర్వహించుకుని శుక్రవారం పొద్దున ఇంటికి రాగానే భార్యతో గొడవకు దిగాడు.భార్య మెడపై కాలుతో తొక్కి వెంటనే కత్తితో గొంతు కోశాడు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి

కుమారుడు తల్లినీ రక్షించే ప్రయత్నం చేయగా కోపంతో కుమారుడిపై కూడా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.బాలుడు స్వల్ప గాయాలతో తప్పించుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చాడు.

Advertisement

పోలీసులు వచ్చేలోపే శోభ రక్తం మడుగులోకి జారుకుంది.హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.పరారీ లో ఉన్న రాజ్ కుమార్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలుస్తున్నారు.

తాజా వార్తలు